![]() |
![]() |
.webp)
కొంతమంది బుల్లితెర నటీనటులు నటనతో ఫేమస్ అవుతుంటారు. మరికొందరు వారు సీరియల్ లో వేసుకునే దుస్తులతో క్రేజ్ తెచ్చుకుంటారు. అలా రకరకాల చీరలతో, వెరైటీ డిజైన్ బ్లౌజ్ లతో ఆడాళ్ళ మనసు దోచేసిన నటి విష్ణుప్రియ.
జానకి కలగనలేదు సీరియల్‌లో మల్లికను మర్చిపోయినా.. ఆమె వేసుకునే బుట్టల జాకెట్, సిల్క్ శారీలు మాత్రం మన ఆడాళ్లకు భలే గుర్తు. బుట్టల జాకెట్ ఎక్కడ కనిపించినా.. ‘ఒసేయ్.. ఇది జానకి కలగనలేదు సీరియల్‌లో మల్లిక వేసుకునే జాకెట్ కదా’ అని గుర్తుకు తెచ్చుకుంటారు మన ఆడాళ్లు. అయితే ఇప్పుడు ఆమె గుర్తుపట్టలేని విధంగా ఫుల్ స్టైలిష్‌గా మారిపోయింది.
బిగ్ బాస్‌కి ముందు ప్రియాంక జైన్, అమర్ దీప్ చౌదరి జంటగా నటించిన ‘జానకి కలగనలేదు’ సీరియల్‌లో మల్లిక గుర్తింది కదా.. అదేనండీ విష్ణు భార్య. భర్తతో వేరే కాపురం పెట్టడానికి ప్రయత్నించి.. జానకిని ముప్పుతిప్పలుపెట్టిన ఆ మల్లిక అసలు పేరు విష్ణు ప్రియ. ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో పాటు అనేక సీరియల్స్‌లో నటించిన ఈ బుల్లితెర భామ.. Mr & Mrs సుధామూర్తి షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బుల్లితెర భామకి ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. జానకి కలగనలేదులో తింగరి పిల్లలా కనిపించిన విష్ణుప్రియ.. ప్రెజెంట్ గెటప్పూ సెటప్పూ మొత్తం మార్చేసింది. ఇక ఈ ఫోటోలకి తమ తోటి సహాయ నటీనటులు లైక్స్, కామెంట్లు చేయగా నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు. ఈమె ఆమేనా అన్నట్టుగా ఉన్న ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
![]() |
![]() |